Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 November 2025, 5:04 pm Posted by : ramakrishna

పార్టీ బలపడేది కార్యకర్తల అంకితభావంతోనే

  • ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పార్టీ బలపడేది కార్యకర్తల అంకితభావం ద్వారానే అని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన అర్బన్ నియోజకవర్గం స్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్యఅతిధి గా ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్త పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. కేంద్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బూత్ కమిటీలను బలోపేతం,  చేయాలని సూచించారు. పార్టీ అంతర్గత క్రమశిక్షణ, ఐక్యత, ప్రజల్లో విశ్వాసం మరింత పెంచడంలో అందరు కలిసి పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోల్లా లక్ష్మి నారాయణ, పోతంకర్ లక్ష్మి నారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు న్యాలం రాజు, బీజేపీ జిల్లా సెక్రటరీ జోతి, జిల్లా బీజేపీ మీడియా కన్వీనర్ పుట్ట వీరేందర్, బీజేపీ మండల అధ్యక్షులు తారక్ వేణు, ఆనంద్ రావు,ఇప్పకాయల కిషోర్, గడ్డం రాజు,కోడూరు నాగరాజు, భూపతి  అన్ని డివిజన్ల ముఖ్య నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.

The party is strengthened by the dedication of its workers.