పట్టణ పరిశుభ్రతలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పట్టణ పరిశుభ్రతలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ అన్నారు. పట్టణంలో పరిశుభ్రత పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో శనివారం పలు డివిజన్‌లలో ప్రత్యేక మున్సిపల్ పారిశుధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పారిశుధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది విస్తృతంగా పాల్గొని పరిసరాల పరిశుభ్రతకు సంబంధించిన పనులను చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించడం, మురుగు కాలువలను శుభ్రపరచడం,...