Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 9:43 pm Posted by : ramakrishna

బంగారం బిస్కేట్ ను ఎత్తుకెళ్లిన పెయింటర్

 

. . . పట్టుకుని బిస్కేట్ ను రికవరి చేసిన పోలీసులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

పెయింటింగ్ పనికోసం వచ్చిన పేయింటర్ ఇంటి యజమానులు ఏమరు పాటుగా ఉండటం గమనించి పనిలో భాగంగా ఇంటి సజ్జపై ఉన్న బంగారు బిస్కేట్ ను చోరి చేశారు. ఆలస్యంగా గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెయింటర్ ను పట్టుకుని బంగారం బిస్కేట్ ను రికవరి చేసి అతడిని రిమాండ్ కు పంపించారు.. నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ కథనం ప్రకారం…నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్ ప్రాంతంలో ఒక ఇంటిలో పెయింటింగ్ పనులు జరుగుతున్నాయి. అక్కడ పెయింటింగ్ కోసం నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతానికి చెందిన షేక్ ఫరిద్ అలియాస్ షేక్ షరిఫ్ తో పాటు మరో పెయింటర్ ఈసా బిన్ అబ్దుల్లా అలియాస్ డాన్ తో కలిసి పనికి వెళ్లాడు. పనిలో భాగంగా ఇద్దరు ఇంటిలో పెయింటింగ్ వేసి సాయంత్రం పని ముగించుకొని వాళ్ళిద్దరూ ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలో గత నెల మే 9 న ఉదయం అందాజా 10 గంటలకు సజ్జపై పెట్టుకున్న బ్యాగును చెక్ చేయగా అందులో 100 గ్రాముల బంగారం (gold బిస్కట్) కనబడలేదు. వెంటనే ఇంటి యజమాని పడకంటి మౌనిక ఐదో టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న ఐదవ టౌన్ పోలీస్ సిబ్బంది చాకచక్యంగా సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించి, పెయింటింగ్ పనికి వచ్చిన అనుమానితుల వివరాలను సేకరించి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో షేక్ ఫరీద్ అలియాస్ షేక్ షరీఫ్ దొంగలించిన బంగారాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా సోమవారం ఉదయం బాబన్ సాబ్ పహాడ్ బ్రిడ్జ్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుచుండగా పోలీసులు అతనిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకోగా, అతని వద్ద నుండి దొంగిలించిన బంగారు బిస్కెట్‌ను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఇట్టి కేసు చేధనకు నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ అఫ్ పోలీస్, బి.ప్రకాష్ ఆధ్వర్యంలో టీం గా ఏర్పడి బి.శ్రీనివాస్ నార్త్ రూరల్ సర్కిల్ ఇన్స్ పెక్టర్, ఎం.గంగాధర్ సబ్ ఇన్స్ పెక్టర్ పి‌ఎస్ ఐదవ టౌన్, సిబ్బంది కేసును వివిధ కోణాలలో పరిశోదించి ఇట్టి దొంగతనం కేసులో నిందితుని గా ఉన్న షేక్ ఫరీద్ @ షేక్ షరీఫ్ ను పట్టుకున్నారు. నిందితుని పట్టుకున్న పై పోలీసు సిబ్బంది అందరిని బి.ప్రకాష్, అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్, నిజామాబాద్ డివిజన్ అభినందిoచారు.

 

The painter who lifted the gold biscuit