పొంగిపొర్లుతున్న గుండె కల్లూర్ వాగు
నిలిచిన రాకపోకలు మద్నూరు, బతుకమ్మ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి గుండెకల్లుర్ వాగు పొంగిపొర్లుతుంది. బిచ్కుంద,మిషన్ కల్లాలి,గుండె కల్లూర్ వాగు వంతెన పై నుండి పొంగి పొంగిపొర్లయంతో రాకపోకలు నిలిచిపోయాయి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో ఇదే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జ్ కుంగిపోయి ఇరువైపులా మట్టి కొట్టుకుపోతుందని ఈ మార్గంలో ప్రయాణించడానికి ఇబ్బందికరంగా ఉందని పేర్కొన్నారు. మాకు శాశ్వత పరిష్కారం కల్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కు అధికారులకు గుండెకులూర్ గ్రామస్తులు కోరుకుంటున్నారు.