పొంగి పొర్లుతున్న బుడ్మి వాగు..

పిట్లంకు రాకపోకలు బంద్   బతుకమ్మ, బాన్సువాడ : బాన్సువాడ మండల కేంద్రంలోని గురువారం కురిసిన భారీ వర్షాలకి వాగులు వంకలు ఒకటయ్యాయి.బాన్సువాడ నగరం మొత్తం జలమలమయ్యింది.అటు పిట్లం నుండి బాన్సువాడ వెళ్లే దారిలో ఠాగూర్ కాలేజ్ వద్ద ఉన్న చిన్న వాగు ఉప్పొంగడంతో బాన్సువాడ - పిట్లంకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.పిట్లం వైపు వాహనాలు వెళ్లకుండా అధికారులు బ్రిడ్జి వద్ద ట్రాక్టర్ ట్రాలీను అడ్డుగా ఉంచారు.పిట్లం వెళ్లే దారిలో ప్రమాదం పొంచి ఉందని పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు.