Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 March 2026, 8:01 pm Posted by : ramakrishna

కార్యచరణను విజయవంతం చేయాలి

 

. . . బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి

 

బాన్సువాడ బతుకమ్మ :

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించబడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మున్సిపల్ ఛైర్పర్సన్ విజయ కాసులవార్, వైస్ ఛైర్పర్సన్ రేష్మా బేగం, కౌన్సిలర్లు, ప్రజా ప్రజా ప్రతినిధులు మెప్మ అర్పిలతో కలిసి ప్రజా పాలనప్రగతి ప్రణాళికను విజయవంతంగా అమలు చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ కిరణ్మయి మాట్లాడుతూ పట్టణంలో పారిశుధ్య నిర్వహణ మెరుగుదల, ప్లాస్టిక్ నిషేధం అమలు, చెత్త వర్గీకరణ, డ్రైనేజీ శుభ్రత, పచ్చదనం పెంపు వంటి కార్యక్రమాలను 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా అమలు చేయనున్నట్లు తెలిపారు. ఈరోజు 06-03-2026 నుండి 12-06-2026 వరకు కొనసాగనుందని తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రజల సహకారం ఎంతో అవసరమని, మున్సిపాలిటీ చేపట్టే కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీహరి రాజు,మున్సిపల్ పాలకవర్గం సిబ్బంది ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.