- పిల్లల వైద్య నిపుణులు డా.నీలి రామచందర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిమోఫిలియా వ్యాధి వచ్చిందంటే మనం చేయగలిగింది ఏమి లేదని దీనిని నయం చేయలేమని నివారణ ఒక్కటే మార్గమని పిల్లల వైద్య నిపుణులు డా.నీలి రామచందర్ అన్నారు. ఆదివారం మారుతి నగర్ లోని స్నేహ సొసైటీలో, హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో హిమోఫిలియా బాధితులకు,వారి తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇన్హిబిట్టర్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నీలి రామచందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో విజయానందరావు ఆధ్వర్యంలో తోటి హిమోపిలియా బాధితుల కొరకు అందిస్తున్న సేవలను ఆయన అభినందించారు. హిమోపిలియా పుట్టుకతో, జన్యు లోపం వల్ల వచ్చే వ్యాధి అని దీనికి స్క్రీనింగ్, కౌన్సిలింగ్ అవసరమని ప్రతి ఒక్కరూ నక్షత్రాలు జాతకాలు ఏ విధంగా చూసుకుంటారో అదేవిధంగా ప్రతి ఒక్కరి బ్లడ్ ప్రొఫైల్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని ఆయన సూచించారు. హిమోఫిలియా ఒకసారి వచ్చిందంటే మనం చేయగలిగింది ఏమి లేదని దీనిని నయం చేయలేమని నివారణ ఒక్కటే మార్గమని ఆయన సూచించారు. హిమోఫిలియా బాధితులకు ప్రభుత్వం ముందుకు వచ్చి వారిలో మనోధైర్యాన్ని కల్పించి నిరంతరంగా ఫ్యాక్టర్స్ అందించాలని ఆయన కోరారు. వారి కొరకు వసతులు పెంపొందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ హిమోపిలియా 150 సంవత్సరాల క్రితమే రాజకుమారులకు ఉండేదని వారు ఎందుకు చనిపోతున్నారో తెలిసేది కాదని కాల క్రమేన తెలుసుకున్నది ఏమిటంటే వారు హిమాపేలియాతో చనిపోతున్నారని చెప్పారు. హిమోఫిలియా ఎలా వస్తుంది ఎలా నివారించాలి అనే అంశాలపై హిమపిలియా బాధితులకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. హిమోఫిలియోపై పేరెంట్స్ కే కాకుండా టీచర్స్ కూడా అవగాహన ఉండాలని పిల్లలు స్కూల్లో ఆటలు ఆడేటప్పుడు ఏదైనా దెబ్బలు తగిలితే రక్తస్రావం నివారించడానికి ఏమి చికిత్స చేయాలో వారికి అవగాహన ఉండాలని ఆయన తెలిపారు మందులు మాత్రమే హిమోఫీలియా సమస్యను పరిష్కరించవని సమాజ సహకారం కూడా దీనికి సహకరించాలని ఆయన తెలిపారు. హిమోఫిలియను ఒక వ్యాధిగా భావించకుండా భయపడకుండా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమానికి హిమోఫిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ అధ్యక్షులు దాసరి విజయనంద రావు అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో ఇంటస్ ఫౌండేషన్ ద్వారా హిమోపిలియా బాధితులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల విలువైన ఫాక్టర్స్ ని అందించారు. హిమోపిలియ బాధితులకు ఇన్హిబిటర్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయానంద రావు రాసిన హిమోఫిలియా పై కరపత్రాన్ని విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య,ఇంటాస్ ఫౌండేషన్ ప్రతినిధి కరుణాకర్, బర్దిపూర్ పిఎస్సి చైర్మన్ రామకృష్ణ, హిమోపిలియా సొసైటీ నిజామాబాద్ చాప్టర్ కోశాధికారి మహమ్మద్ ఎజాజ్, జనరల్ సెక్రెటరీ గంగారం, వైస్ ప్రెసిడెంట్ అంబరీష్, హిమోపిలియా బాధితులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.