Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 March 2025, 3:13 pm Posted by : ramakrishna

కొనసాగుతున్న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, బతుకమ్మ : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం ఆలయ అర్చకులు అగ్ని ప్రతిష్ఠ,ధ్వజారోహణం పూజలు చేశారు. పూజల్లో ఆలయ ఈవో భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,ఆలయ అధికారులు,భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం అర్చకులు భేరిపూజ,దేవతాహ్వానం,హావనము పూజలు నిర్వహించారు. ఆదివారం కావడంతో  ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది.