ఇంటర్‌ పరీక్షల్లో కొనసాగుతున్న తప్పుల పరంపర

వెబ్ న్యూస్, బతుకమ్మ : ఇంటర్‌ పరీక్షల్లో తప్పుల పరంపర కొనసాగుతోంది. బుధవారం నిర్వహించిన బోటనీ పరీక్షలో 5,7 ప్రశ్నల్లో,  మ్యాథ్స్‌ 4వ ప్రశ్నలో తప్పులు వచ్చాయి.  మంగళవారం జరిగిన మూడు పేపర్లలో,  అలాగే ఇంగ్లీష్‌ పేపర్‌లో ఒక ప్రశ్నలో తప్పు వచ్చిన విషయం తెలిసిందే.  ప్రతి రోజూ పరీక్షల్లో తప్పులు వస్తుండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది.