కొనసాగుతున్న శ్రీ రాజేశ్వర ఆలయ పునఃనిర్మాణ పనులు..

రుద్రూర్, బతుకమ్మ : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రుద్రూర్ మండల కేంద్రంలో గల అతి పురాతనమైన శ్రీ రాజరాజేశ్వర దేవాలయ పునఃనిర్మాణ పనులు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత మూడు రోజుల నుండి కొనసాగుతున్నాయి. అతిపురాతనమైన దేవాలయాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దనున్నారు. మహా శివరాత్రికి శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో స్వామి వారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టానున్నారు.