పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి

రుద్రూర్, బతుకమ్మ : సీపిఎస్ విధానం రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి కోరుతూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టిపియుఎస్) ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్ తారాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల న్యాయమైన కోరికలన్నీ నెరవేరుతాయని ఎన్నో కలలుగన్నామన్నారు. కానీ కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆశలను అడియాశలు చేస్తూ ఆగస్ట్ 23, 2014 రోజున ఒక చీకటి...