Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 February 2026, 6:30 pm Posted by : ramakrishna

2003 ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలి

 

. . . హై కోర్టు తీర్పును అమలు చేయాలి

 

. . . రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్

 

హైదరాబాద్, బతుకమ్మ :

 

2003 ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్ అన్నారు. గురువారం హైదరాబాద్ లోని సచివాలయం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్షి కె. రామకృష్ణారావు ని ఆయన చాంబర్ లో కలిసి 2003 ఉద్యోగ ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వ మెమో 57 ఆధారంగా ఇటీవల హై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం ప్రధాన కార్యదర్శి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 2003 ఉద్యోగ ఉపాధ్యాయ పాత పెన్షన్ పోరాట  సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్షి ఇమ్మడి సంతోష్ కుమార్, రాష్ట్ర కోశాధికారి గుంటి వేణుగోపాల్, అసోసియేటడ్ అధ్యక్షులు పులిపాక కిషన్, నాయకులు వై. రవింధర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

The old pension system should be applied to 2003 employees.