ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం స్థానికంగా ఓల్డ్ ఏజ్ హోం నూతనముగా నిర్మించిన భవనాన్ని కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఓల్డ్ ఏజ్ హోం నిర్మాణ పనులు పూర్తయినందున ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. నీటి సరఫరాకు పైప్ లైన్ బోరు నుండి వేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు. భవనం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో...