ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెరగాలి
వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షలో కలెక్టర్ వెల్లడి నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి వైద్యాధికారులకు సూచించారు. ఈ విషయమై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పనితీరులో స్పష్టమైన మార్పు రావాల్సిందేనని స్పష్టం చేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జిల్లా వైద్యారోగ్య శాఖ పనితీరుపై కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష జరిపారు. పీ.హెచ్.సీలు, సీ.హెచ్.సీలు,. హెల్త్ సబ్ సెంటర్ల...