ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ కామారెడ్డి, బతుకమ్మ : గ్రామాలలో చేపట్టే ఉపాధిహామీ పనులలో కూలీల సంఖ్య పెంచాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నర్సరీలు, మరుగుదొడ్లు, ప్రాపర్టీ పన్ను, త్రాగునీరు, సి.సి.చార్జీలు తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని, జాబ్ కార్డు ఉన్న ప్రతీ కూలీ కి...