Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 April 2026, 7:11 pm Posted by : ramakrishna

క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశ్యంతో ఎన్.పీ.ఎల్ నిర్వహణ

 

. . . నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐదు రకాల క్రీడా పోటీల నిర్వహణ

 

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లా స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో “నిజామాబాద్ ప్రీమియర్ లీగ్” జిల్లా స్థాయి క్రీడా పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఈ క్రీడా పోటీల ద్వారా ముఖ్యంగా యువకులకు, ప్రజలకు సైబర్ సెక్యూరిటీ, మాదక ద్రవ్యాల నిర్మూలన, ట్రాఫిక్ నిబంధనల పట్ల విస్తృత అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ మెగా టోర్నమెంట్ నిర్వహణ కోసం సీపీ ఎన్ఎస్ సీచైర్మన్‌గా, బస్వ రెడ్డి ఎన్ఎస్ సీకన్వినర్‌గా,కవిత రెడ్డి ఎన్ఎస్ సీజనరల్ సెక్రటరీగా ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షణలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కమిటీలో జాయింట్ సెక్రటరీలుగా కే.శ్రీనివాస్ రెడ్డి (స్పోర్ట్స్), డా. కే.శిరీష్ కుమార్ (సైబర్ సెక్యూరిటీ), రజినీకాంత్ (ఫిజికల్ సెక్యూరిటీ) మరియు ట్రెజరర్‌గా కే. సంతోష్ కుమార్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడా పోటీలలో భాగంగా మొత్తం ఐదు రకాల ఆటల పోటీలను వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ, యోగా, క్రికెట్ నిర్వహిస్తున్నారు. వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడ్డీ పోటీలు నిజామాబాద్‌లోని డీఎస్ఎమైదానంలో జరగనున్నాయని, ఈ మూడు విభాగాలలో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 20,000, రెండవ బహుమతిగా రూ. 10,000,మూడవ బహుమతిగా రూ. 5,000 అందజేయబడునన్నారు. కబడ్డీ పోటీలు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమని తెలిపారు. అలాగే యోగా పోటీలు సుభాష్ నగర్‌లోని కాకతీయ ఒలంపియాడ్ స్కూల్‌లో నిర్వహించబడతాయని, ఇందులో అండర్-14, అండర్-18, 18 ఏళ్లు పైబడిన బాలబాలికలకు మొత్తం 6 క్యాటగిరీలలో 18 బహుమతులు ఉంటాయన్నారు. యోగా విభాగంలో విజేతలకు మొదటి బహుమతిగా రూ. 3,000, రెండవ బహుమతిగా రూ. 2,000, మూడవ బహుమతిగా రూ. 1,000 అందజేయబడునన్నారు. క్రికెట్ పోటీలు కంటేశ్వర్‌లోని మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో 12 ఓవర్ల ఫార్మాట్‌లో హార్డ్ టెన్నిస్ బాల్‌తో నిర్వహించబడునని, క్రికెట్ ఎంట్రీ ఫీజు రూ.5,000 కాగా, కేవలం మొదట నమోదు చేసుకున్న టీములకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుందన్నారు.

 

The NPL is being organized with the aim of encouraging players.

 

క్రికెట్ విజేతలకు భారీ స్థాయిలో మొదటి బహుమతి రూ. లక్ష, రన్నరప్‌కు రూ. 50,000 నగదు బహుమతిని ప్రకటించారు. క్రికెట్ క్రీడాకారులు సొంతంగా తెలుపు ప్యాంట్, తెలుపు బూట్లు తెచ్చుకోవాలని, నిర్వాహకులు కేవలం టీ-షర్టులు మాత్రమే అందిస్తారని తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన వారు ఏప్రిల్ 11 నుండి ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పోటీలకు సంబంధించిన డ్రా ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటలకు తీయబడునన్నారు. ఈ టోర్నమెంట్ కేవలం నిజామాబాద్ జిల్లా నివాసులకు మాత్రమే అవకాశం ఉండటంతో, క్రీడాకారులు తప్పనిసరిగా ఆధార్ కార్డ్ వెంట తీసుకురావాలని, యోగా పోటీదారులు వయస్సు ధృవీకరణ కోసం స్కూల్ బోనఫైడ్ లేదా ఎస్ఎస్ సీమెమో సమర్పించాల్సి ఉంటుందన్నారు. టోర్నమెంట్ సమన్వయకర్తలుగా జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బి. పవన్ కుమార్ (9701177144), కబడ్డీ కోచ్ ప్రశాంత్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలోని క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీపీ కోరారు. వాలీబాల్ కి బి. మల్లేష్ గౌడ్ (9440711635), బాస్కెట్ బాల్ కి బి. నరేష్ (9440404424), కబడ్డీ కి ఎం. ప్రశాంత్ (9866770889), యోగా కి సంగీత (9848420803), గంగాధర్ (8074982200), క్రికెట్ కి సురేష్ కుమార్ (9849202586), విక్రమ్ ( 9493309972) లు ఇన్ చార్జ్ లుగా ఉన్నారని తెలిపారు.

The NPL is being organized with the aim of encouraging players.