అతిథి అధ్యాపకుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ను రద్దు చేయాలి

ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో తెయూ రిజిస్ట్రార్ కు వినతి నిజామాబాద్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీలో రహస్యంగా విడుదల చేసిన అతిథి అధ్యాపకుల ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం వారు తెయూ రిజిస్ట్రార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రఘురాం, అంజలి మాట్లాడుతూ గతనెల 24న వెలువడ్డ అతిథి అధ్యాపకుల ప్రకటన లోపభూయిష్టంగా ఉందన్నారు.  తెలుగులో -02, ఇంగ్లీష్ లో -01,  ఫార్మస్యూటికల్ కెమిస్ట్రీ-01,...