. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, బతుకమ్మ: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో నాన్చివేత ధోరణి సరికాదని, ప్రభుత్వం స్పందించి వెంటనే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలు విడుదల చేయాలని పీఆర్ సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన ధర్మాగ్రహ దీక్షకు ధన్ పాల్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులకు నాలుగు డీఏలు, పెండింగ్ బిల్లులు విడుదల చేసి పీఆర్ సీ అమలు చేయాలన్నారు. దీక్షలో తపస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కృష్ణవేణి, బద్రినాథ్, రాష్ర్ట అదనపు ప్రధాన కార్యదర్శి పాపగారి రామకృష్ణారెడ్డి, రాష్ర్ట ఉపాధ్యక్షులు కీర్తి సుదర్శన్, కార్యదర్శి వరప్రసాద్, జిల్లా బాధ్యులు రాఘవేందర్ రావు, కిషన్ రెడ్డి, మధుసూదన్, శ్రీనివాస్, నారాయణ, ప్రభాకర్, రాజ్ కుమార్, నరోత్తం, రమాదేవి, స్వప్న, లహరి, కవిత, మీనా తదితరులు పాల్గొన్నారు.