ప్రశ్నించేతత్వాన్ని ముందు తరాలకు నేర్పించాలి
బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాగృతి కార్యాలయంలో ’లీడర్‘ పోస్టర్ ఆవిష్కరణ హైదరాబాద్, బతుకమ్మ : ప్రశ్నించేతత్వం మనతో ఆగవద్దని, ముందు తరాలకు నేర్పించాలని బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో “లీడర్” కార్యక్రమం పేరిట నాయకత్వ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లోని జాగృతి కార్యాలయంలో కవిత ’లీడర్‘ పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడారు. రాజకీయ నేపథ్యంలో లేని వారికి తెలంగాణ జాగృతి ఒక వేదిక అన్నారు. యువత, మహిళలకు తెలంగాణ జాగృతి ఒక...