ఎన్‌సీఎస్‌ఎఫ్ ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించాలి
. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ (ఎన్‌సీఎస్‌ఎఫ్)ని వెంటనే పునఃప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. ఈ మేరకు సీపీఎం జిల్లా ప్రతినిధి బృందం ఫ్యాక్టరీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించింది. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వెంకట్రాములు మాట్లాడుతూ 2008 వరకు విజయవంతంగా నడిచిన నిజామాబాద్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీతో పాటు బోధన్ దక్కన్ షుగర్...