Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 November 2026, 5:28 pm Posted by : ramakrishna

పసుపు రైతుల అభ్యున్నతే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు కృషి

 

. . . మామిడిపల్లిలో రైతులకు బాయిలర్ పాలిషర్ యంత్రాల పంపిణీ

 

. . . పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి  

 

ఆర్మూర్, బతుకమ్మ :

 

పసుపు రైతుల ఆర్థికాభివృద్ధి,  వారి ఉత్పత్తులకు మెరుగైన ధర కల్పించడమే లక్ష్యంగా జాతీయ పసుపు బోర్డు ఆధ్వర్యంలో ఆర్మూర్ లోని మామిడిపల్లిలో రైతులకు బాయిలర్, పాలిషర్ యంత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ పసుపు సాగుకు ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి జాతీయ పసుపు బోర్డు కట్టుబడి ఉందన్నారు. ఆధునిక యంత్రాలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పసుపు ఉడకబెట్టడం, పాలిషింగ్ ప్రక్రియలు మరింత సులభతరం అవుతాయని, తద్వారా ఉత్పత్తి నాణ్యత పెరిగి మార్కెట్‌లో రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, పసుపు సాగు అభివృద్ధి, నాణ్యమైన ఉత్పత్తుల సాధనకు జాతీయ పసుపు బోర్డు నిరంతరం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాల పనితీరు, వాటి వినియోగంపై అధికారులు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో పసుపు బోర్డు సెక్రటరీ భవానీ శ్రీ, డిప్యూటీ డైరెక్టర్  ప్రత్యూష్, సీనియర్ ఫీల్డ్ ఆఫీసర్ రాజమాణిక్యం,  రాణి, జవహర్, జాతీయ పసుపు బోర్డు కార్యాలయ అధికారులు, యంత్రాల లబ్ధిదారులు, పెద్ద సంఖ్యలో పసుపు రైతులు పాల్గొన్నారు.