Batukammanews
Newspaper Banner
Date of Publish : 10 August 2026, 6:16 pm Posted by : ramakrishna

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

 

. . . బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బీజేపీ పట్టణ అధ్యక్షుడు గంగారెడ్డి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బాన్సువాడ పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంపై సోమవారం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ప్రజలు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ ఐక్యతను చాటిచెప్పాలని కోరారు. విద్యార్థులు, యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు ‘హర్ ఘర్ తిరంగా’ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  మన దేశం.. మన జెండా.. మన గర్వం.. అనే నినాదంతో ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలని గంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శివప్రసాద్, జిల్లా ధార్మిక సెల్ జాయింట్ కన్వీనర్ కులకర్ణి శ్రీనివాస్‌రావు, బీజేపీ నాయకులు పాశం భాస్కర్‌రెడ్డి, గోస్కే పురుషోత్తం, హెచ్. లక్ష్మణ్, ప్రదీప్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.