Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 November 2024, 4:52 pm Posted by : ramakrishna

హత్య చేసిన వారే సానుభూతి తెలుపుతున్నారు

  • ప్రశాంత్ రెడ్డి తీరుపై మండిపడ్డ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : సర్పంచుల సమస్యలపై టిఆర్ఎస్ నాయకులు స్పందించిన విధానం చూస్తుంటే హాస్యాస్పదంగా ఉందని ,మరి ముఖ్యంగా బాల్కొండ ఎంఎల్ఏ ప్రశాంత్ రెడ్డి సర్పంచుల సమస్యలపై మాట్లాడుతుంటే హత్య చేసిన వారే సానుభూతి తెలుపుతున్నట్టు ఉందని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విమర్శించారు.  గతంలో టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు సర్పంచులకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టి, ఉద్యమాలు చేసిన సర్పంచులను జైల్లో పెట్టించిన చరిత్ర టిఆర్ఎస్ నాయకులదనితెలిపారు. కానీ ఇప్పుడు వారు సర్పంచుల సమస్యలపై మాట్లాడడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు వుంది అని ఎద్దేవా చేశారు. సర్పంచులు ఒక్కసారి ఆలోచించాలని గతంలో మీకు ఇలాంటి ఇబ్బందులు కల్పించిన వారే ఇప్పుడు మీ సమస్యల పట్ల స్పందిస్తున్నారని, మీ డబ్బులు ఆలస్యం కావడానికి కారకులు ఎవరో మీరు ఆలోచించుకోవాలని సూచించారు. కచ్చితంగా సర్పంచుల సమస్యలపై ప్రభుత్వం ముందుకు వస్తుందని, గతంలో ఏడు లక్షల కోట్ల అప్పుతో పాటు 60 వేల కోట్ల బకాయిలను మిగిలిచిన ఘనత టీఆర్ఎస్ పార్టీదని, అందులో సర్పంచుల, బిల్లులు ,కాంట్రాక్టర్ల బిల్లులు, ఎంపీటీసీలకు ఇచ్చిన నిధులు, ఫీజు రియంబర్స్మెంట్, సీఎంఆర్ఎఫ్ ,కళ్యాణ లక్ష్మి లాంటి ఎన్నో బకాయిలను పెండింగ్ లో పెట్టిన చరిత్ర టిఆర్ఎస్ పార్టీదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఐదు,ఆరు నెలలోనే కొద్ది కొద్దిగా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లిస్తుందని ,కానీ సర్పంచ్ల సమస్యలకు కారకులైన వారే  వారి సమస్యల గురించి మాట్లాడడామనేది వారి అజ్ఞానానికి నిదర్శనం అని అన్నారు. ఆరోజు టిఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో సర్పంచులు తమ ఆస్తులు అమ్మి ప్రజలకు మంచి పనులు చేశారని, కానీ అప్పటి పాలకులకు అది కనబడలేదని అందుకే మీ బకాయిలు చెల్లించలేదని అన్నారు.  ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ సమస్య పట్ల అవగాహన ఉంది అని ,సర్పంచుల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు వస్తుందని తెలిపారు.  సమస్యలకు కారకులు ఎవరు అనేది ఒక్కసారి సర్పంచులు ఆలోచన చేసుకోవాలని అన్నారు. సర్పంచ్ లకు రావాల్సిన బిల్లులు పెండింగ్ పెట్టిన ప్రశాంత్ రెడ్డి వాస్తవాలను తెలపాలని,కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద సర్పంచుల బిల్లులు చెల్లించే ప్రణాళిక వుందని పేర్కొన్నారు.