Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2024, 12:49 pm Posted by : ramakrishna

ఎన్ని నిర్బంధాలు చేపట్టిన బెల్ట్ షాపుల మూసివేతకు చేపట్టిన ఉద్యమం ఆపను

  • రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపుల నిర్మూలన తన ధ్యేయం
  • తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ వ్యవస్థాపకురాలు కృపా జ్యోతి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా చేపడుతున్న ఆమరణ నిరాహార దీక్షకు భయపడిన రాష్ట్ర ప్రభుత్వం… తెలంగాణ ప్రజా సైన్యం పార్టీ ఆధ్వర్యంలో బెల్ట్ షాపులకు వ్యతిరేకంగా చేయబోతున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని చేయవద్దని అడ్డుకోవడం సిగ్గుచేటని కృపా జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద బెల్ట్ షాప్ లో మూసివేయాలని ఆమరణ నిరాహారదీక్షకు కృప జ్యోతి సిద్ధమైన విషయం తెలిసింది. పోలీసులు అనుమతులు లేవని నిరసన దీక్ష చేయవద్దని నోటిసులు ఇవ్వడంతో కృపా జ్యోతి మీడియాతో మాట్లాడుతూ…. రాష్ట్రంలోని బెల్ట్ షాపులను మూసివేసే వరకు తన ఈ పోరాటం ఆగదు అని ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా నా ఈ పోరాటాన్ని మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు. తనకు ఎవరు అండగా వచ్చినా, రాకపోయినా ఈ నా పోరాటాన్ని కొనసాగిస్తూనేఉంటానని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాప్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

The promises made by the Congress government should be implemented