Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2025, 5:30 pm Posted by : ramakrishna

అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీది

  • హక్కులు సాధించాలంటే పోరాటాలు ఒక్కటే మార్గం
  • సిపిఐ ఎమ్మెల్యే,  రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అత్యంత ప్రమాదకరమైన సిద్ధాంతం బీజేపీ పార్టీదని, మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేస్తుందని కార్మిక కర్షకుల శ్రమను దోపిడి చేసి బడా బడా నాయకులకు దోచిపెడుతుందని సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మార్కెట్ యార్డు హమాలి, దడువాయి, చాట స్వీపర్ వర్కర్స్ యూనియన్  (ఏఐటీయూసీ) 2 వ రాష్ట్ర మహా సభలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రద్ధనంద్ గంజ్ లో జరిగాయి. ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు మాట్లాడుతూ.. నిజామాబాద్ లో సిపిఐ పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహా సభ ఘనంగా నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. ఏఐటియుసి చేసిన పోరాటాల ఫలితంగానే 50 కిలోల బస్తాలు రావడం గర్వకారణమన్నారు. పోరాటాల వల్లనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు.  హామాలీలకు సమగ్ర చట్టం రావాలన్నారు. చట్టం వస్తే అన్ని  అందులో పొందుపరుస్తారని, దింతో న్యాయం జరిగిందన్నారు. భవన నిర్మాణ కార్మికులకు చట్టం ఉందని గుర్తు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ లతోనే ప్రజల సమస్యలకు పరిష్కారం దొరుకుటుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎర్ర జండా సత్తా చాటాలన్నారు. కమ్యూనిష్టులు భారతంలో కృష్ణుడి లాంటి వారని, కమ్యూనిస్టులు ఏ వైపు ఉంటే ఆ వైపు బలం ఉంటుందన్నారు. ఎలాంటి స్వార్థం లేని సిద్ధాంతాలు గల పార్టీ సిపిఐ అని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం సంపద ను  అదానీ, అంబానిలకు దోచి పెట్టీ సబ్బండ వర్గాలను మోసం చేస్తుందన్నారు. కార్పొరేట్ సంస్థల్లో తక్కువ మంది చేతిలో ఎక్కువ సంపద కుప్పలు కుప్పలుగా ములుగుతుందన్నారు. కమ్యూనిస్ట్ లు చేసే పోరాటం రాహుల్ గాంధీ కూడా చేస్తున్నారని, బీజేపీ చేస్తున్న అన్యాయాలను బయటకు తీసుకువస్తున్నారన్నారు. రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయాలని బీజేపీ చూస్తుందని, ఏ దేశంలోకి వెళ్ళిన ఏ ఖండంలోకి వెళ్లిన ఎర్ర జెండా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కూలీ రేట్లు ఒకే విధంగా ఉండాలని, కార్మికుల వయసు 58 నుంచి 65 వరకు పెంచాలని, ప్రభుత్వం పిఎఫ్ఈ  ఎస్ ఐ అమలు చేయాలన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని కార్మికులకు అండగా ఉంటామన్నారు. గత పది ఏళ్లలో మార్కెట్ యార్డ్ ఉందా లేద ఆన్నట్టుగా ఉండేదని, రైతు బిడ్డను మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్కెట్ కళకళలాడుతుందన్నారు. మార్కెట్ యార్డ్ కార్మికులకు అండగా మేముంటామని అన్నారు.  130 మందికి ఇల్లు లేవని నా దృష్టికి వచ్చిందని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి ఇండ్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అర్హులైన అందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. 65 సంవత్సరాల పెంపు  ఈఎస్ ఐ ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెతామన్నారు. ప్రమాదంలో చనిపోయిన వారికి లక్ష రూపాయలు ఇచ్చేలా చూస్తామన్నారు. సిపిఐ మిత్ర పక్ష పార్టీ అని తప్పకుండా కార్మిక కార్థకులకు అండగా ఉంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మిక కర్షక పార్టీ అన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నమన్నారు. 200 కోట్ల మహిళలు బస్సులలో ప్రయాణించారని 6800 కోట్లు మహిళ్ళకు మిగిలిపోయాని గుర్తు చేశారు.సమస్యలు అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పూర్తి చేసేలా చూస్తామన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్రా ష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్ల సంఘం అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ .మార్కెట్ లో కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని  ఇన్స్యూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.గతంలో పరిపాలన చేసిన ప్రభుత్వం కార్మికుల పట్ల చిన్న చూపు చూసారని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మార్కెట్ లో లైసెన్సులు రెన్యువల్ చేయడం జరిగిందన్నారు.వ్యాపారస్తులను కొంత ఇబ్బంది పెట్టిన గాని కార్మికులను మాత్రం ఏనాడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలతో పాటు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహాయ సహకారాలతో మార్కెట్ అభివృద్ది కి నా వంతు కృషి చేస్తానని అన్నారు. మార్కెట్ యార్డు లో  రైతులకు కార్మికుల కోసం ఉచిత భోజన క్యాంటీన్ ఏర్పాటు చేయనున్నమన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ మాట్లాడుతూ.. శ్రమను ధారపోసి సంపదను సృష్టించేది కార్మికులని వారికి చట్ట బద్ధమైన హక్కులు కల్పించాలన్నారు.. పిఎఫ్ అమలు చేయాలని వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.పనిలో ప్రమాదాలు జరుగుతున్నాయని వారికి ఇన్స్యూరెన్స్ కల్పించాలన్నారు. ఇండ్లు లేని వారికి మార్కెట్ పరిసరాల్లో ఇండ్లు కట్టి ఇవ్వాలని కోరారు.  రైతులు గిట్టు బాటు ధర లేదని అమ్మడానికి సరైన సౌకర్యాలు లేవని రైతు పడించిన ధాన్యం మార్కెట్ యార్డు కు తీసుకువస్తే కార్మికులకు యాడాదిలో పది నెలలు పని దొరుకుతుందన్నారు. ప్రభుత్వానికి సెస్ రూపంలో ఆదాయం సమకూరుతుందన్నారు.  కార్మికుల హక్కుల సాధనలో ఏఐటియుసి ముందుంటుందన్నారు.

The most dangerous ideology is that of BJP.

  • ఎర్ర జండాలతో కార్మీకుల భారీ ర్యాలీ..

శ్రద్ధ నంద్ గంజ్ హమాలీ జిల్లా భవనం నుంచి శివాజీ చౌక్, రైల్వే గేట్  అవుట్ గేట్ మీదిగా ఉమా మహేశ్వర హాల్ వరకు వేలాది మంది ఏఐటియుసి మార్కెట్ యార్డు సంఘాల ఆధ్వర్యంలో జండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాల్ రాజ్ చేతుల మీదుగా జండా ఆవిష్కరించారు.ఈ మహాసభలకు  ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి వై. ఓమయ్య అధ్యక్షత వహించారు. బాల్ రాజ్, రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి నర్సింహా, సహాయ కార్యదర్శి ప్రవీణ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు  కంజర భూమయ్య, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పి. సుధాకర్ విచ్చేశారు. అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

The most dangerous ideology is that of BJP.