Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 January 2025, 4:23 pm Posted by : ramakrishna

మెడికవర్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్

నిజామాబాద్, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలోని మెడికవర్ హాస్పిటల్ లో అత్యంత క్లిష్టమైన గుండె ఆపరేషన్ నిర్వహించినట్లు మెడికవర్ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిట్ లో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భీంగల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన గంగారాం అనే వ్యక్తికి 16 సంవత్సరాల క్రితం ఒపెన్ హర్ట్, బైపాస్ సర్జరీ జరిగింది. గత నెల డిసెంబర్ 6న చాతి నొప్పి, దమ్ముతో మెడికవర్ హాస్పిటల్ కు వచ్చాడు. ఎమర్జెన్సీ లో ఇనెట్వెన్షన్ కార్డియాలజీస్ట్ డా. రవి కిరణ్ ఏంజియోగ్రమ్ చేసి 16 సంవత్సరాల క్రితం జరిగిన ఆపరేషన్ వద్ద మళ్ళీ ఇబ్బంది వచ్చిందని గ్రహించాడు.  మళ్ళీ అటువంటి ఆపరేషన్ ని చేయాలని కార్డియో తొరాసిక్ సర్జన్ డా.అవీన్ సనర్ కి తెలియజేశారు. డా.అవిన్ సనర్ పేషంట్, బంధువు లకు ఆపరేషన్ యొక్క రిస్క్ తెలియజేసి వాళ్ల అంగీకారం తో ఆపరేషన్ విజయవంతం చేశారు. ఆపరేషన్ జరిగిన 6 వ రోజు పేషంట్ ని డిశ్చార్జ్ చేయటం జరిగింది అని డా.అవిన్ సానర్ అన్నారు. డా.వను అనేస్తిషేయ మాట్లాడుతూ ఇలాంటి హై రిస్క్ తో కూడిన ఆపరేషన్ నిజామాబాద్ జిల్లాలో మొట్ట మొదటి సారి మెడికోవర్ హాస్పటల్ లో జరిగింది. ఇది చాలా రిస్క్ తో కూడిన ఆపరేషన్ అని అన్నారు. సెంటర్ హెడ్ స్వామి మాట్లాడుతూ మెడికవర్ హాస్పటల్స్ నిజామాబాద్ లో నెల కి 15 నుండి 20 ఓపెన్ హార్ట్ ఆపరేషన్ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో డిఎంఎస్ డాక్టర్ యజ్ఞ, మార్కెటింగ్ హెడ్ వినయ్ కుమార్ పాల్గొన్నారు.