Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 January 2026, 4:15 pm Posted by : ramakrishna

బూజు పట్టిన మండల సమీకృత కార్యాలయం

– పరిశుభ్రత పై అధికారుల నిర్లక్ష్యం…

 

రుద్రూర్, బతుకమ్మ :

 

హవ్వ నవ్విపోదురు గాక మన ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటాం కానీ రుద్రూర్ మండల కేంద్రంలోని సమీకృత మండల సముదాయ భవన కార్యాలయం మొత్తం బూజు పట్టి ఉండడంతో కార్యాలయానికి వచ్చిన వారు పలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పరిశుభ్రత ఎక్కడ ఉందని పలువురు నివ్వేరపోతున్నారు. కార్యాలయానికి మొత్తం బూజు పట్టిన కూడా అధికారులు తమకేమీలే అన్నచందంగా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి సమీకృత మండల భవన కార్యాలయాన్ని శుభ్ర పర్చాలని కార్యాలయానికి వచ్చిన ప్రజలు కోరుతున్నారు.

 

The moldy mandal integrated office
The moldy mandal integrated office