బతుకమ్మ, ఆర్మూర్ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు పత్రాలను ఆర్మూర్ పట్టణ కన్వీనర్ మిరియాల్కర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎమ్మార్వో కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి ఆర్మూర్ అసెంబ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు కన్వీనర్ జెస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ పట్టణ కన్వీనర్ మిరియాల్కర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పూర్తి చేసిన ఓటర్ నమోదు పత్రాలను ధ్రువీకరణ పత్రాలతో జతచేసి ఆర్మూర్ ఎమ్మార్వో కి అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పులి యుగంధర్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పీర్ సింగ్ నాయక్, కార్యదర్శి రవీందర్ నాయక్, ఓబీసీ మోర్చా ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు రెడ్డబోయిన దక్షిణామూర్తి మరియు పెర్కిట్ బాలు తదితరులు పాల్గొన్నారు.