Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 December 2024, 8:14 pm Posted by : ramakrishna

అర్బన్ లో పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బిజీ బిజీ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో అర్బన్ నియోజకవర్గం ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్నారు. నగర శివారులోని మాణిక్ బండార్ చెక్క లో కాకతీయ కిడ్స్ కాలేజ్ భవాని ట్రేడర్స్ ను ప్రారంభించారు. 45వ డివిజన్ లోని దేవి థియేటర్ సమీపంలో స్నేహితులైన అఖిల్, మహేష్ లు నెలకొల్పిన పార్టీ థియేటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 44 వ డివిజన్ పరిధిలోని ద్వారాకా నగర్ లోని మెట్రో మల్టీ స్పెషలిటీ హాస్పిటల్ ను ప్రారంభించారు. అలాగే నగర శివారులోని 13 డివిజన్ పరిధిలోని సారంగాపూర్ లో మల్లన్న దేవుడి పూజా కార్యక్రమం లో పాల్గొన్నారు.

The MLA is busy with many inauguration programs in Urban