ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెను కూల్చిన అగంతుకలను వెంటనే శిక్షించాలి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెను కూల్చిన అగంతుకలను వెంటనే శిక్షించాలని బుధవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ టౌన్ లో మున్సిపల్ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. ఈ నెల 1న ఎమ్మార్పీఎస్ దిమ్మె నిర్మాణం కోసం కమిషనర్ ని కలిసి అనుమతి కోరామని తెలిపారు. ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీస్ వద్దకు పంపారని తెలిపారు. ఆ ఆఫీసర్ మమల్ని దిమ్మె కట్టుకోండి అని చెప్పి, కట్టుకున్న దిమ్మె మీద జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత...