నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మార్పీఎస్ జెండా దిమ్మెను కూల్చిన అగంతుకలను వెంటనే శిక్షించాలని బుధవారం ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ, వీహెచ్పీఎస్, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ టౌన్ లో మున్సిపల్ ఆఫీసు ముందు నిరసన తెలిపారు. ఈ నెల 1న ఎమ్మార్పీఎస్ దిమ్మె నిర్మాణం కోసం కమిషనర్ ని కలిసి అనుమతి కోరామని తెలిపారు. ఆయన టౌన్ ప్లానింగ్ ఆఫీస్ వద్దకు పంపారని తెలిపారు. ఆ ఆఫీసర్ మమల్ని దిమ్మె కట్టుకోండి అని చెప్పి, కట్టుకున్న దిమ్మె మీద జెండా ఆవిష్కరణ చేసిన తర్వాత దొంగ చాటున రాత్రికిరాత్రి జెండా దిమ్మెను కూల్చారని పేర్కొన్నారు. ఈ అంశాన్ని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కమిషనర్ ఇలానే ప్రవర్తిస్తే రానున్న రోజులలో పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇక్కడ నిజామాబాద్ లో బలమైన ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ జాతీయ అధ్యక్షులు సుజాత సూర్యవంశి, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జీలు కుడాల స్వామి మాదిగ, ఇరుగు పైడి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీజిల్లా అధ్యక్షులు సరికేల పోశెట్టి మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేష్ మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు రొడ్డ ప్రవీణ్, ఆకారం రమేష్, మందర్న మారుతి, జిల్లా కార్యదర్శి చెవురి శ్యాం, యమున, సత్తెక్క, ఎమ్మార్పీఎస్ నాయకులు, వీహెచ్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.