ఐఎఫ్టియు నిజాంబాద్ జిల్లా అధ్యక్షులు భూమన్న
బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : కలకత్తాలో జూనియర్ డాక్టర్ అభయ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు భూమన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఐ ఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపుమేరకు నిజాంబాద్ నగరంలోని ధర్నా చౌక్ లో ఐయప్టియు ఆధ్వర్యంలో మంగళవానం నిరసన ప్రదర్శన నిర్వహించారు.అభయ న్యాయం కోసం డబ్లుడీజేడీఎఫ్ పిలుపునకు సంఘీభావంగా జాతీయ కమిటీ ప్రకటించిందని ఆయన తెలిపారు. స్వతంత్ర భారతదేశంలో మహిళలు ఉన్నత విద్య కోసం నగరాలకు వెళ్లి చదివే పరిస్థితి లేకుండా భయానక వాతావరణాన్నిదుర్మార్గులు సృష్టిస్తున్నారని ఆయన అన్నారు. జునియర్ డాక్టర్ అభయ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కలకత్తాలాంటి పట్టణంలో ఒక ఉన్నత విద్య అభ్యసించే మహిళలకే రక్షణ లేకపోతే ఇక దేశంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాతృదేవోభవ అంటూ మాతృమూర్తి లాంటి
అభయను అంతం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించి, మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. అశ్లీల సాహిత్యం, బూతు సినిమాలను నిషేధించి
యువతను తప్పుడు ఆలోచనల ప్రభావం నుండి పాలకులు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు.
మహిళా ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఈ విషయంలో కఠినంగా నిర్ణయం తీసుకొని, మహిళల జోలికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు మచ్చ మోహన్ మొగులయ్య. గంగా దాస్. వీరయ్య. శంకర్. రాజు తదితరులు పాల్గొన్నారు.