మోర్తాడ్, బతుకమ్మ: పరిసరాలను పరిశుభ్రపరుస్తూ చేస్తున్న పని దైవంగా భావించే మనస్తత్వం పారిశుద్ధ కార్మికులదని పంచాయతీ కార్యదర్శి సైపోద్దిన్ అన్నారు. దసరా పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులకు కార్యదర్శి చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.