- పీడీఎస్యూ మాజీ మండల కన్వీనర్ ఎం.నరసింహ
భీమ్ గల్, బతుకమ్మ : ఈ నెల 28 న జరిగే సభలో రెండు వేర్వేరు పీ డీ ఎస్ యూ రాష్ట్ర కార్యవర్గాలు విలీనం కావడం హర్షనీయమని భీమ్ గల్ మండల పీడీఎస్ యు మాజీ కన్వీనర్ ఎం. నరసింహ అన్నారు.శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంఘం ఉస్మానియా యూనివర్సిటీ లో పురుడోసుకుని నేడు దేశ వ్యాప్తంగా పీడిత విద్యార్థుల పక్షాన పోరడుతుందని,50 సంవత్సరాల సుదీర్ఘ పోరాట వారసత్వాని సొంతం చేసుకొని,పాలక ప్రభుత్వాలు ఎంతటి నిర్భంధం ప్రయోగించిన ఎప్పటికప్పుడు వాటికి సవాలు విసురుతూ, తన ప్రత్యేకతను చాటుకుంటున్నాయని అన్నారు.దేశ విప్లవ విద్యార్ధి ఉద్యమానికి దిక్సూచిగా నిలిచి జార్జి రెడ్డి త్యాగం, జంపాల చంద్రశేఖర్ అమరత్వం, అమర వీరుల అంకిత భావం అశేషమైన పీడిత విద్యార్థి లోకాన్ని నేటికీ కదిలిస్తూనే ఉందన్నారు.వీరి ఆశయ సాధనలో ఇప్పటి వరకు విడివిడిగా కొనసాగిన రెండు విద్యార్ధి సంఘాలు ఇప్పుడు ఒక్కటవ్వడం గొప్ప విషయం అన్నారు.ఈ రెండు వర్గాలు ఏకమవడాన్ని చూసి ప్రగతిశీల విద్యార్థి అభిమానులు, విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థులు కూడా ఆనందం వ్యక్తపరుస్తారని తెలిపారు.ఈ కలయిక పటిష్టమైన విప్లవ విద్యార్ధి ఉద్యమానికి తోడ్పాటు అందిస్తుందన్నారు.దేశ విప్లవ విద్యార్ధి ఉద్యమం లో ఇదొక చరిత్రాత్మకమైన పరిణామమని,ఐక్యమవ్వడమే కాకుండా దేశం లో మరిన్ని విప్లవ విద్యార్ధి సంఘాలతో ఏకం అవ్వడానికి ప్రయత్నించాలన్నారు . ఏకం అవ్వడం ద్వారా మరింత బలమైన విద్యార్ధి ఉద్యమాన్ని నిర్మిస్తుందని,ఈ ఐక్యతను అందరూ విజయవంతం చేయాలని కోరారు . గతం లో జరిగిన అన్ని తప్పిదాలను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని,విద్యా సమస్యల కోసం నిరంతరం పోరాటం చేయాలని నరసింహ కోరారు.