Batukammanews
Newspaper Banner
Date of Publish : 28 December 2024, 9:24 pm Posted by : ramakrishna

గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీల వైద్య సేవలు భేష్

  • ఐఎంఏ నిబంధనల పేరుతో దాడులు జరగడం దురదృష్టకరం
  • ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వైద్య సేవలు లేని పరిస్థితుల్లో స్థానికంగా ఉంటూ అక్కడ ఉన్న ప్రజల ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వైట్ ఎప్పటికప్పుడు వైద్య చికిత్సలు అందించే పీఎంపీల సేవలు అద్భుతమని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. నగర శివారులోని ఓ ఫంక్షన్ హాల్ లో శనివారం జరిగిన ఆర్ఎంపీ పి ఏం పిల్లా సభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యంగా ఉన్నప్పుడే పి ఎంపీల పై జరుగుతున్న దాడులను అరికట్టవచ్చని, గ్రామీణ స్థాయిలో వైద్యం అందని మారుమూల ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు కాపాడుతూ వైద్యం అందించే పీఎంపీలపై ఐఎంఏ నిబంధనల పేరిట కొందరు దాడులు చేయడం సరైనది కాదన్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేయకపోతే నేడు గ్రామాలలో ప్రజలు ఉండేవారు కాదని అన్నారు. ఇప్పటికైనా ఆర్ఎంపి పి.ఎం.పి వైద్యులు కలిసికట్టుగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే వారిపై దాడులు జరగవు అన్నారు. కార్యక్రమంలో పి.ఎం.పి అసోసియేషన్ వ్యవస్థాపకులు పులగం మోహన్, జన విజ్ఞాన వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మారెడ్డి, రమేష్ ఆర్ఎంపీపీ ఎంపీ అసోసియేషన్ల కార్యవర్గం నాయకులు తదితరులు పాల్గొన్నారు.