Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 March 2026, 8:33 pm Posted by : ramakrishna

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

 

. . . రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

 

. . . ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ లక్ష్మి (48) కి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కృష్ణాజివాడి గ్రామానికి చెందిన శ్యాములు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలవడం జరిగిందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, రెడ్ క్రాస్ సంస్థ, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాల సహకారంతో ఇప్పటివరకు 25 వేల యూనిట్లకు పైగా రక్తాన్ని, 300 పైగా రక్తదాన శిబిరాలను, తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 6000 వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగిందని కామారెడ్డి జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరాయంగా పనిచేస్తున్నామని అన్నారు. రక్తదానానికి సహకరిస్తున్న రక్తదాతలకు, మీడియా ప్రతినిధులకు, శ్రేయోభిలాషులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మరిన్ని రక్తదాన శిబిరాలను తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహిస్తామని అన్నారు. రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాత శ్యాములు కు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రక్తదాత సాయిలు, బ్లడ్ బ్యాంక్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.