మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనం వాడుకలోకి తీసుకురావాలి

సీపీఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా రూ.40.50 కోట్లతో నిర్మించిన మాతా శిశు ఆరోగ్య కేంద్రం వాడుకలోకి తీసుకురావాలని సీపీఎం ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రం భవనం 2022లోనే పూర్తయినప్పటికీ నేటికీ వాడుకలోకి తేకపోవటంతో కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతుందని అన్నారు. వెంటనే  దాన్ని ప్రారంభించే వాడకంలోకి తేవాలని డిమాండ్ చేశారు.