Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 August 2025, 4:56 pm Posted by : ramakrishna

మంజీర నది ఉగ్రరూపం

  • హాంగర్గ గ్రామ ప్రజల తరలింపు

 

బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హాంగర్గ గ్రామం మంజీర నది ఉధృత ప్రవాహం కారణంగా వరద ముంపుకు గురైంది. గ్రామం మొత్తం నీరు చుట్టుముట్టడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. పరిస్థితిని గమనించిన అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ వినయ్ రెడ్డి ఆదేశాల మేరకు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, తాసిల్దార్ విట్టల్ సమన్వయంతో రెవెన్యూ, పోలీసులు, రెస్క్యూ సిబ్బంది గ్రామానికి చేరుకొని లైఫ్ బోట్స్ సాయంతో వంద మందికి పైగా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం వరద ప్రవాహం కొనసాగుతుండటంతో పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమస్యలు ఎదురైనా వెంటనే స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

The Manjira River in its fury

 

The Manjira River in its fury