సీఎం కప్ టోర్నీ నిర్వహణ అభినందనీయం

ఆర్మూర్, బతుకమ్మ : గ్రామీణ ప్రాంతం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ నిర్వహించడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు సొప్పారి వినోద్, జక్రాన్ పల్లి మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. సీఎం కప్ టోర్నీ క్రీడాకారులకు వారు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.