రెసిడెన్షియల్ స్కూల్స్, భవిత కేంద్రాల నిర్వహణ మరింతగా మెరుగుపడాలి
. . . మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ సమీక్ష నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, భవిత కేంద్రాల నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టర్ ఇలా త్రిపాఠి మండల ప్రత్యేక అధికారులతో శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సుదీర్ఘ సమీక్ష జరిపారు. ఒక్కో మండలం వారీగా స్పెషల్ ఆఫీసర్లు జరిపిన క్షేత్రస్థాయి సందర్శనలు, ఆయా పాఠశాలల్లో వారు గమనించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయా స్కూళ్ళలో నెలకొని ఉన్న స్థితిగతులు, పెండింగ్ పనులు, ఎం.ఎస్.ఓ...