Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 December 2025, 6:09 pm Posted by : ramakrishna

శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణనే ప్రధాన ధ్యేయం

 

. . . స్వేచ్చా యుతంగా ప్రజలు ఓటు హక్కు వినియోగించు కోవాలి

. . . పోలీస్ యాక్ట్ 30 ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

. . . రాష్ట్ర డిజిపి  బి శివధర్ రెడ్డి

 కామారెడ్డి, బతుకమ్మ :

ప్రజాస్వామ్యంలో  ఎన్నికలు అత్యంత కీలకం . ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలను  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కావున ప్రతీ ఒక్కరూ వారి ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు, భయబ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే వాతావరణాన్ని కల్పించడం పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని  రాష్ట్ర డిజిపి బి. శివధర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా పోలీసు అధికారుల తో స్థానిక సంస్థల ఎన్నికల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డిజిపీ మాట్లాడుతూ…సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, ద్వేషపూరిత పోస్టులు లేదా ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసే కార్యకలాపాలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరు ఎన్నికల నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు. ఎన్నికల అనంతరం అదే రోజు విజయోత్సవ ర్యాలీ యందు వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నందున ఎవరు ర్యాలీ లు తీయరాదని తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ ఉన్నందున ముందస్తు అనుమతులు తప్పనిసరి అని సూచించారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల సందర్భంలో బైండోవర్ చేసిన వ్యక్తులలో ఐదుగురు ప్రవర్తన నిబంధనలను ఉల్లంఘించగా, వారి పూచికత్తుగా చూపిన డబ్బులపై జరిమానా విధించబడింది. బైండోవర్ పేపర్ కు మాత్రమే పరిమితం కాకుండా, ఎవరైనా బైండోవర్ సంబంధిత నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానా విధించబడతుందని స్పష్టంగా తెలిపారు. అలాగే, ఈ నియమాలను మళ్లీ ఉల్లంఘించిన వ్యక్తులపై చట్టపరమైన తగు చర్యలు కూడా తీసుకోబడతాయని పేర్కొన్నారు. ప్రజల భద్రత, రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యం అని డీజీపీ పేర్కొన్నారు.జిల్లాలోని సున్నితమైన పోలింగ్ కేంద్రాల గ్రామాల వివరాలను అడిగి అక్కడ తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేశారు.

డీజీపీ శివధర్ రెడ్డి కి పోలీస్ అధికారులు ఘన స్వాగతం..

The main objective is to conduct elections in a peaceful environment.

The main objective is to conduct elections in a peaceful environment.

రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ  రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. అనంతరం డీజీపీ పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ బాస్ అధికారులతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం  నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల సంసిద్ధతను తెలియజేశారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక భద్రతా ప్రణాళికలు, బౌండోవర్ చర్యలు, చెక్పోస్టులో, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు పనితీరు, స్వాధీనం వివరాలు, పోలింగ్ రోజు భద్రతా ఏర్పాట్లు మొబైల్ టీమ్స్, క్విక్ రెస్పాన్స్ టీమ్స్ తదితర అంశాలను సమగ్రంగా వివరించారు. జిల్లా పరిధిలోని డీఎస్పీలను డీజీపీ స్వయంగా మాట్లాడి వారి పరిధిలోని భద్రతా ఏర్పాట్లు, సమస్యలు , ఫోర్స్ వినియోగంపై ప్రత్యక్ష వివరాలు సేకరించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి, నిజామాబాద్ అదనపు కమిషనర్ బస్వారెడ్డి, కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఉమ్మడి జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఆరఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.

 

The main objective is to conduct elections in a peaceful environment.