Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2026, 9:24 pm Posted by : ramakrishna

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం

 

. . . జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు

జుక్కల్, బతుకమ్మ :

 

ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు స్పష్టం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ప్రజలతో కలుసుకుని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చిన ప్రజలు తమ తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని ఆయన ఓర్పుతో, శ్రద్ధగా విని సంబంధిత అధికారులతో వెంటనే ఫోన్ ద్వారా మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు త్వరితగతిన తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.