Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 June 2026, 5:52 pm Posted by : ramakrishna

ఏపీలో లాకప్ డెత్ నిజమే…

 

. . . పోలీస్ కస్టడీలోనే సాయికృష్ణ మ తి

 

. . . తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలుకు ముందే కస్టడీలో మ తి

 

విజయవాడ,  బతుకమ్మ :

 

రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన గాడె సాయికృష్ణ కస్టడీ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ కీలక మలుపు తిరిగింది. సిట్ సమర్పించిన రిమాండ్ నివేదికలో పలువురు పోలీసు సిబ్బంది పాత్ర ఆధారాల మాయం  నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. దర్యాప్తు ప్రకారం… రౌడిషీట్ తో పాటు పలు నేరాలతో సంబంధం ఉన్న సాయికృష్ణను  నాన్-బెయిలబుల్ వారెంట్ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ చేసిన అనంతరం చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరచకుండా పోలీస్ కస్టడీలోనే ఉంచినట్లు సిట్ గుర్తించినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న ఐదు రోజుల వ్యవధిలోనే సాయికృష్ణ మరణించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఈ కేసులో సస్పెండ్ అయిన పోలీసు అధికారి నాగరాజు సహా పలువురు పోలీసు సిబ్బంది పాత్రపై సిట్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఘటన అనంతరం కీలక ఆధారాలను ధ్వంసం చేయడం సాక్ష్యాలను మాయం చేయడం వంటి చర్యలు జరిగినట్లు విచారణలో గుర్తించినట్లు నివేదిక పేర్కొంటోంది. సాయికృష్ణ అదృశ్యంపై అతని తల్లి విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసుగా నమోదైన ఈ వ్యవహారం తరువాత లాకప్ డెత్ అనుమానాలతో ప్రత్యేక దర్యాప్తుకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సిట్ బృందం మొత్తం 17 మంది సాక్షులను విచారించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన సిబ్బందితో పాటు ఇతర ప్రాంతాల నుంచి విధులకు వచ్చిన పోలీసులను కూడా ప్రశ్నించింది. దర్యాప్తులో భాగంగా ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన కొన్ని కీలక వీడియో రికార్డులు అందుబాటులో లేకపోవడం డేటా భద్రపరచకపోవడం పట్ల సిట్ అనుమానాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మే 6 నుంచి 8 తేదీల మధ్య సాయికృష్ణను చివరిసారిగా చూసినట్లు కొందరు సాక్షులు వెల్లడించినట్లు సమాచారం. అనంతరం అతని ఆచూకీ లభించకపోవడంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. సాక్షుల వాంగ్మూలాలు సాంకేతిక ఆధారాలు ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా సాయికృష్ణ కస్టడీలోనే మరణించి ఉండొచ్చనే నిర్ధారణకు సిట్ వచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోగామరికొందరిపై కూడా చట్టపరమైన చర్యలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఈ కేసులో తప్పించుకోవడానికి సీఐ (సస్పెండెడ్) నాగరాజు ఆధారాలు దొరక్కుంగా మాయం చేశారని సిట్ గుర్తించింది. సాయికృష్ణ మరణించాడని తెలిసినా కృష్ణలంక పీఎస్ సిబ్బంది ఆ సమాచారం న్యాయ స్థానానికి అందించలేదు. అతడు చనిపోయాడని సాయికృష్ణ తల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్తే నాగరాజు దూషించారు. హైకోర్టులో ఆమె హెబియస్ కార్పస్ పిటిషన్ వేసినా సిఐ వాస్తవాలను అందించలేదు. నిజాలు దాచి న్యాయ స్థానాన్ని తప్పుదోవ పట్టించారు. సాయికృష్ణ లాకప్ డెత్ అయ్యాక డెడ్ బాడీని మాయం చేశారు. అయితే మే 6 – 8 తేదీల మధ్య ఓ ఈ-కామర్స్ సంస్థ డెలివరీ బాయ్ సాయికృష్ణను చూసినట్టు ఆ తర్వాత కనిపించలేదని సిట్ కు చెప్పాడు. ఇతర సాక్ష్యులను విచారించిన తర్వాత సాయికృష్ణది కస్టోడియల్ డెత్ గా నిర్దారించారు. మే నెలాఖరులోనే కస్టడీలో ఉన్న సాయికృష్ణ గాయాలపాలై మరణించాడని ధ్రువీకరించారు. దీంతో సిట్ అధికారులు న్యాయ స్థానానికి నివేదిక సమర్పించారు. దీనిని పరిశీలించిన కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. జులై 8న నాగరాజును తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.

 

The lock-up death in AP is indeed true...