Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 February 2025, 12:06 am Posted by : ramakrishna

ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ఖరారు

  •  పట్టభద్రుల ఓటర్లు 3,55,159
  • టీచర్ ఓటర్లు 27088

కరీంనగర్, బతుకమ్మ :
కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల పరిధిలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితాను వెలువరించారు. 4 ఉమ్మడి జిల్లాల పరిధిలో మొత్తం పట్టభద్రులు 3,55,159 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. టీచర్ల ఎమ్మెల్సీ ఓటర్లు 27,088గా లెక్కలు తేల్చారు. ఈ నెల 27న జరుగనున్న ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్లు దాఖలు, ఉపసంహరణలు పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ లు నువ్వానేనా అన్న రీతిలో తలపడుతుండగా బీఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థులు కూడా తామేమి తక్కువ కాదన్నట్లు గట్టి పోటీనే ఇస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన ఉపాధ్యాయ సంఘం పీఆర్ టీయూతో పాటు టీపీటీఎఫ్, ఎస్టీయూ అభ్యర్థులతో పాటు బీజేపీ అభ్యర్థి, మరో 11 మంది పోటీ పడుతున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు తక్కువగా ఉండడంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు మీటింగ్ లు జరుగుతున్నాయి.

  • గ్రాడ్యుయేట్ ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి

కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలో 6137, మంచిర్యాల్ లో 30921, ఆదిలాబాద్ లో 14,935, నిర్మల్ లో 17141, నిజామాబాద్ లో 31,574, కామారెడ్డిలో 16410, జగిత్యాల్ లో 35,281, పెద్దపల్లిలో 31037, కరీంనగర్ లో 71,545 , రాజన్నసిరిసిల్లా జిల్లాలో 22397, సంగారెడ్డిలో 25,652, మెదక్ లో 12472, సిద్దిపేట్ లో 32,589, హన్మకొండలో 4585, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2483 ఓటర్లుగా నమోదై ఉన్నారు.

  • టీచర్ ఎమ్మెల్సీ ఓటర్ల వివరాలు

కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లాలో 470, మంచిర్యాల్ లో 1664, ఆదిలాబాద్ లో 1593, నిర్మల్ లో 1966, నిజామాబాద్ లో 3751, కామారెడ్డిలో 2011, జగిత్యాల్ లో 1769, పెద్దపల్లిలో 1111, కరీంనగర్ లో 4305 , రాజన్నసిరిసిల్లా జిల్లాలో 950, సంగారెడ్డిలో 2690, మెదక్ లో 1347, సిద్దిపేట్ లో 3212, హన్మకొండలో 166, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 83 మంది టీచర్ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.