Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 November 2026, 1:00 pm Posted by : ramakrishna

అబానీ రాయ్‌ జీవితం ఆర్ఎస్ పి కార్యకర్తలకు ఆధర్శం

 

. . .పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కటారి రాములు

ఇందూర్, బతుకమ్మ:

రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్‌ఎస్‌పీ) జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన కామ్రేడ్ అబానీ రాయ్ 5వ వర్ధంతిని ఆర్‌ఎస్‌పీ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం అబానీ రాయ్ వర్ధంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని నాందేవాడలో గల  ఆర్ ఎస్ పి పార్టి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగాఆర్‌ఎస్‌పీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కటారి రాములు మాట్లాడుతూ, కామ్రేడ్ అబానీ రాయ్ పార్టీ నిర్మాణం, కార్మిక ఉద్యమాల బలోపేతం, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తన జీవితమంతా అంకితం చేసిన మహోన్నత నాయకుడు కొనియాడారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి వివాహం చేసుకోకుండా పార్టీ, ప్రజా ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసిన ఆదర్శ విప్లవ నాయకుల్లో ఆయన ఒకరని పేర్కొన్నారు.అబానీ రాయ్ 1959లో ఆర్‌ఎస్‌పీలో చేరి యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గా కార్మికుల హక్కుల కోసం విశేషంగా పోరాడారని, అనంతరం పార్టీ కేంద్ర సెక్రటేరియట్ సభ్యుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారని తెలిపారు..

1998 నుంచి 2011 వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వరుసగా మూడు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగా సేవలందిస్తూ దేశ రాజకీయాల్లో వామపక్ష ఉద్యమ గొంతుకగా నిలిచారని అన్నారు.2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జానకి రాములుతో కలిసి రాష్ట్రంలో పార్టీ నిర్మాణానికి విశేష కృషి చేసి, పార్టీ విస్తరణకు కీలక పాత్ర పోషించారని కటారి రాములు గుర్తు చేశారు. ఆయన చూపిన మార్గంలో పార్టీ కార్యకర్తలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ వైఎఫ్ జిల్లా కన్వీనర్ పిట్ల నరేష్, నాయకులు గోపాల్ సింగ్ ఠాకూర్, చరణ్, ఇపాన్, తదితరులు పాల్గొన్నారు

The life of Abani Roy is an inspiration to RSP activists