Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 8:20 pm Posted by : ramakrishna

గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

 

. . . కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మీ నారాయణ

 

. . . ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా విద్యా వారోత్సవాలు

 

ఎల్లారెడ్డి, బతుకమ్మ :

 

విద్యార్థులందకూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకుని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మీ నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి పాలన లో నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాల లో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం గ్రంథాలయ జ్ఞానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి రోజు గ్రంథాలయాన్ని సందర్శించి సక్రమంగా ఉపమోగించుకుంటున్న విద్యార్థిని, విద్యార్థులను బెస్ట్ రీడర్స్ గా ఎంపిక చేసి వారికి నోట్ బుక్కలు, పెన్నులు అందించారు. అనంతరం కళాశాల సమన్వయకర్త డా.వి.శంకరయ్య మాట్లాడుతూ పుస్తకంలో గల జ్ఞానాన్ని మనము సద్వినియోగం చేసుకుంటే అందరూ కూడా ఉన్నత స్థాయిలో నిలుస్తారని తమ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం చంద్రకాంత్, డాక్టర్ వి.శంకరయ్య, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు ఎస్ చంద్రకాంత్, రాణి, అధ్యాపకులు నాగానిక, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ గంగారెడ్డి, డా జి.సిద్ధురాజు, కృష్ణప్రసాద్, డా.ఎస్. గోదావరి, శశిధర్, సంతోష్, దశరథ్, వసంత లక్ష్మి, హరికృష్ణ, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

 

The library should be utilized.