Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 July 2025, 12:02 pm Posted by : ramakrishna

మేకను చంపిన చిరుత పులి

జానకంపేట అడవి ప్రాంతంలో ఘటన

వారం రోజుల్లో చిరుతల అలజడి రెండోసారి

 ఎడపల్లి, బతుకమ్మ :  నిజామాబాద్ జిల్లా జానకంపేట అటవీప్రాంతంలో మేకల మందపై చిరుత దాడి చేసింది. ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జానకంపేట సారంగాపూర్ అటవీ ప్రాంతంలో మేకలను షెడ్ ఆవరణలో ఉంచగా చిరుత పులి దాడి చేసింది. ఈఘటనలో ఒక మేక మృతి చెందినట్లు గుర్తించారు. సంబంధిత చిరుత పులి దాడి దృశ్యాలు షెడ్ వద్ద ఉన్న సీసీ కెమెరాలు నిక్షిప్తమయ్యాయి. చిరుత పులి మేకను చంపిన విషయం వాస్తవమేనని నార్త్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సంజయ్ గౌడ్ తెలిపారు. ఇటీవల   నార్త్ రేంజ్ పరిధిలో చిరుతల అలజడి వెలుగులోకి రావడం వారం రోజుల్లో రెండోసారి.