Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 March 2025, 1:20 pm Posted by : ramakrishna

స్కూల్ లోకి వచ్చిన చిరుత

రేవా(మధ్య ప్రదేశ్), బతుకమ్మ: పాఠశాలలోకి చిరుతపులి రావడంతో టీచర్లు ఏం చేయాలో తెలియక ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నిశబ్దంగా ఉండిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ర్టంలోని రేవా జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. చిరుతను చూసిన ఓ టీచర్ చాకచక్యంగా వ్యవహరించి దాని దృష్టిని మరల్చి ఓ గదిలోకి వెళ్లేలా చేసింది. ఆ వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్, పోలీసు అధికారులు స్కూల్ కు చేరుకొని చిరుతను బంధించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని యాజమాన్యం పేర్కొంది.