Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 February 2025, 3:42 pm Posted by : ramakrishna

విఆర్ఏల వారసత్వ ఉద్యోగాలను భర్తీచేయాలి        

బతుకమ్మ, వేల్పూర్ : వీఆర్ఏల వారసత్వ ఉద్యోగాలు భర్తీచేయాలని వీఆర్ఏలు మండల అధ్యక్షుడు చిన్న బాలయ్య డిమాండ్ చేశారు.  మంత్రుల  నివాసముదాయాలను ముట్టడికి చేసిన వీఆర్ఏలను అరెస్టు చేసినందుకు నిరసనగా వేల్పూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం వీఆర్ఏలు  నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 61 సంవత్సరాలు వయసు పై బడిన వీఆర్ఏల వారసులకు జీవో 81, 86 ప్రకారం  వెంటనే ఉద్యోగాలు భర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 61 సంవత్సరాలు వయసు పై బడిన 3797 మంది  వీఆర్ఏల వారసులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటను రేవంత్ రెడ్డి సర్కార్ నిలబెట్టుకోవాలన్నారు.