Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 12:52 pm Posted by : ramakrishna

మంత్రి జూపల్లికి ఘనస్వాగతం పలికిన నాయకులు 

బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ పట్టణంలో నూతన ఎక్సైజ్ కార్యాలయ భవన ప్రారంభోత్సవం, అమృత్ 2.0 తాగునీటి సరఫరా పనుల శంకుస్థాపనకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేశ్ షెట్కార్ బాన్సువాడ చేరుకున్నారు. వారికి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, డీసీసీబీ మాజీ ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో వారు సమావేశమయ్యారు.